రామగుండం బీ-థర్మల్ విద్యుత్‌ ప్లాంట్‌ నిర్మాణం జరుగుతుందా ?

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండంలో చేపట్టనున్న 800 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం నిర్మాణంపై చిక్కుముడి వీడ లేదు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు విద్యుత్‌ ప్లాంట్‌ నిర్మాణం అవుతుందా లేదా అనే అంశం ప్రశ్నార్థకంగా మారింది. ప్లాంట్‌ను నిర్మించినట్లయితే ఈ ప్రాంతంలో గల నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని, ప్లాంట్‌ నిర్మాణాన్ని చేపట్టాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ ప్లాంట్‌ నిర్మాణాన్ని ప్రభుత్వం నేరుగా చేపట్టేందుకు కావాల్సిన బడ్జెట్‌ లేకపోవడంతో ఆయా సంస్థలపై ఆధారపడాల్సి వస్తున్నది. వాస్తవానికి సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి పెరుగుతున్న నేపథ్యంలో థర్మల్‌ విద్యుత్‌కు డిమాండ్‌ తగ్గుతున్నది. రామగుండంలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో ఉత్ప త్తి అవుతున్న 2,600 మెగావాట్ల విద్యుత్‌ను డిమాండ్‌ లేక పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయ లేక పోతున్నది. అయితే ఈ ప్లాంట్‌ నిర్మాణ పనులను ఎన్టీపీసీ సంస్థకే అప్పగించాలనే నిర్ణయానికి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు ఆరంభించినట్లు సమా చారం. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తక్కువ సామర్థ్యం గల విద్యుత్‌ ప్లాంట్లను మూసివేయాలని కేంద్ర పర్యావరణ సంస్థ తీసుకున్న నిర్ణయం మేరకు రెండేళ్ల క్రితం రామగుండంలో ఇదివరకే గల 62.5 మెగావాట్ల విద్యుత్‌ ప్లాంట్‌ మూసివేసిన విషయం తెలిసిందే. ఇక్కడ పని చేసిన ఉద్యోగుల ను మరో చోటికి బదిలీ చేశారు. ఎప్పటి నుంచో ఈ కేంద్రాన్ని 800 మెగావాట్ల సామర్థ్యానికి పెంచి కొత్త ప్లాంట్‌ను నిర్మిం చాలని డిమాండ్‌ వస్తున్నది. గడిచిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌సింగ్‌ బీ-థర్మల్‌ కేంద్రాన్ని విస్తరించి 800 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం