పోర్ట్రానిక్స్ ఏరో 10 పవర్ బ్యాంక్ విడుదల

దేశీయ మార్కెట్లో పోర్ట్రోనిక్స్ కొత్త పవర్ బ్యాంక్ పోర్ట్రానిక్స్ ఏరో 10ను విడుదల చేసింది. ఈ పవర్ బ్యాంక్‌లో భారీ 10,000mAh బ్యాటరీ ఉంది. కంపెనీ 20W ఛార్జింగ్ సపోర్ట్‌ అందిస్తుంది. అంతేకాదు.. USB-C కేబుల్ కూడా ఉంటుంది. స్కైర్ షేప్‌లో 245 గ్రాముల బరువు ఉంటుంది. ఈ పవర్ బ్యాంక్ టూ-వే ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. అంటే.. పవర్ బ్యాంకు ఛార్జ్ చేయడమే కాదు.. ఇతర డివైజ్‌లను కూడా ఛార్జ్ చేయగలదు. పోర్ట్రానిక్స్ ఏరో 10 ధర రూ. 2,499గా ఉంది. అయితే, కంపెనీ ప్రారంభ ఆఫర్ కింద ప్రస్తుతం రూ. 1,249కే అందుబాటులో ఉంది. ఈ పవర్ బ్యాంక్‌ను కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల నుంచి కూడా కొనేసుకోవచ్చు. కంపెనీ 12 నెలల వారంటీని కూడా అందిస్తోంది. పోర్ట్రానిక్స్ ఏరో 10 అనేది కంపెనీ కొత్త పవర్ బ్యాంక్ అని చెప్పొచ్చు. 10,000mAh బ్యాటరీతో వస్తుంది. కాంపాక్ట్‌గా జేబులో ఈజీగా సరిపోతుంది. ఈ పవర్ బ్యాంక్ బరువు 245 గ్రాములు ఉంటుంది. బ్లాక్, నేవీ బ్లూ, మోచా కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. లాంగ్, రెక్టాంగులర్ డిజైన్‌లోనే కాదు.. స్క్వేర్ షేప్‌లో కూడా ఉంటుంది. ఈ పవర్ బ్యాంక్ ఇంటర్నల్ కేబుల్‌తో వస్తుంది. USB-C కేబుల్ ఉంటుంది. అవుట్‌పుట్, ఇన్‌పుట్ రెండింటిగా వర్క్ అవుతుంది. ఇతర ఫోన్లను ఛార్జ్ చేయొచ్చు. అలాగే అదే పోర్ట్ నుంచి పవర్ బ్యాంకు కూడా ఛార్జ్ అవుతుంది. ఈ కేబుల్‌ను పవర్ బ్యాంక్‌ క్యారీ చేసేందుకు కూడా వాడొచ్చు. ఈ పవర్ బ్యాంక్‌లో స్టాండర్డ్ USB-C పోర్ట్ కూడా ఉంది. టూ-వే ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఏరో 10 పవర్ బ్యాంక్ యూఎస్‌బీ ద్వారా 20W అవుట్‌పుట్‌ను అందిస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లతో పాటు వైర్‌లెస్ ఇయర్‌బడ్స్, స్మార్ట్‌వాచ్‌లు, ఫిట్‌నెస్ బ్యాండ్‌లు వంటి స్మాల్ డివైజ్‌లతో పాటు ఛార్జ్ టాబ్లెట్‌లను కూడా ఛార్జ్ చేయగలదు.

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం