కాక్‌రోచ్ జనతా పార్టీలో ప్రకాష్ రాజ్ ఎంట్రీ : వైరల్ అవుతున్న వీడియో


సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్న 'కాక్‌రోచ్ జనతా పార్టీ' లోకి ఇప్పుడు సెలబ్రిటీల ఎంట్రీ మొదలైంది. వైవిధ్యభరిత నటుడు ప్రకాష్ రాజ్ తాజాగా ఈ డిజిటల్ ఉద్యమంలో భాగస్వామి అవుతూ సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వీడియోను పంచుకున్నారు. తనను తాను ఒక “బొద్దింక”గా అభివర్ణించుకుంటూనే.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలో ప్రకాష్ రాజ్ ఐస్‌క్రీమ్‌లో మామిడి పండు గుజ్జును కలుపుకుని తింటూ కనిపించారు. దానికి ఆయన పెట్టిన క్యాప్షన్, చేసిన కామెంట్లు ఈ వ్యంగ్య రాజకీయ ఉద్యమానికి మరింత హైప్‌ను తీసుకొచ్చాయి. “బొద్దింకలు మామిడి పండ్లను ఎలా తింటాయో చూడండి” అంటూ ప్రధానమంత్రికి ఇష్టమైన పండుగా చెప్పుకునే మామిడి పండును తింటూ ప్రకాశ్‌రాజ్ ఈ సెటైరికల్ జిల్లేడును విసిరారు. “కాక్‌రోచ్ ఈటింగ్ మ్యాంగోస్.. యమ్మీ” అంటూ #CockroachJantaParty, తన మార్క్ హ్యాష్‌ట్యాగ్ #justasking జత చేసి ఈ వీడియోను పోస్ట్ చేశారు. 61 ఏళ్ల ప్రకాష్ రాజ్ మొదటి నుంచీ ఈ పార్టీ సోషల్ మీడియా అకౌంట్లను ఫాలో అవ్వడమే కాకుండా.. వాటి పోస్టులను షేర్ చేస్తూ యువత గొంతుకను మరింత మందికి చేరువ చేస్తున్నారు.

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం