దేశవ్యాప్తంగా జనగణన ప్రారంభం !
దేశవ్యాప్తంగా జనగణన కార్యక్రమం ఈరోజు నుంచి ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఏపీలో ఏప్రిల్ 16, తెలంగాణలో 23 నుంచి మొదలవుతుంది. స్వాతంత్య్రం తర్వాత ఇది 16వ జనగణన. కరోనా కారణంగా వాయిదా పడిన జనగణనతో పాటు కులగణన కూడా చేపట్టనున్నారు. దీని కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 11,718 కోట్లు ఖర్చు చేస్తోంది. సొంత ఇళ్లు, ఇళ్లు లేనివారు, ఇంటి నిర్మాణ సామగ్రి, తాగునీటి వసతి, విద్యుత్, మరుగుదొడ్డి, వంటగ్యాస్ వినియోగం వంటి అంశాలపై సమాచారం సేకరిస్తారు. ఇంటింటి సర్వేతో పాటు ఆన్‌లైన్‌లోనూ గణనలో పాల్గొనే అవకాశం ఉంది.
Comments
Post a Comment