టర్కీ ఆయిల్ ట్యాంకర్‌పై దాడి


నల్ల సముద్రంలో టర్కీ ట్యాంకర్‌ గురువారం ఉదయం దాడికి గురయ్యింది. రష్యా చమురుతో ఉన్న నౌకపై మానవరహిత వాహనంతో దాడి జరిగినట్టు టర్కీ రవాణా మంత్రి అబ్దుల్‌కాదిర్ ఉరలోగ్లూ తెలిపారు. ''రష్యా ముడి చమురుతో ఉన్న ఓ టర్కీ సంస్థ నిర్వహించే విదేశీ జెండా నౌకలో అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంజిన్ గదిలో పేలుడు సంభవించినట్లు మా అత్యవసర సేవల కేంద్రానికి సమాచారం అందింది'' అని ఆ మంత్రి ఒక టీవీ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ''ప్రత్యేకంగా ఇంజిన్ రూమ్‌నే లక్ష్యంగా చేసుకున్నారని మేము నమ్ముతున్నాం. డ్రోన్‌తో కాకుండా నీటి మట్టంలో ఉన్న మానవరహిత ఉపరితల వాహనంతో ఈ దాడి జరిగిందని మేము భావిస్తున్నాం'' అని వివరించారు. సియెర్రా లియోన్ జెండా ఉన్న ట్యాంకర్‌పై దాడి టర్కీ జలాల్లో జరిగిందా లేదా అనే విషయాన్ని మంత్రి స్పష్టం చేయలేదు. కానీ బోస్ఫరస్ జలసంధికి 30 కిలోమీటర్లలోపే ఈ దాడి జరిగిందని స్థానిక మీడియా నివేదించింది. ''ఓడను అడ్డుకోవాలనే లక్ష్యంతో ప్రత్యేకంగా ఇంజిన్ గదిని లక్ష్యంగా చేసుకోవడాన్ని బట్టి బయటి నుంచి జరిగిన ప్రేరేపిత దాడిగా కనిపిస్తోంది'' అని ఉరలోగ్లు అన్నారు. ''సహాయ చర్యల కోసం బృందాలను సంఘటనా స్థలానికి పంపాం, పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం'' అని ఆయన తెలిపారు. గత వారం రోజులుగా మరోసారి రష్యా, ఉక్రెయిన్‌లు పరస్పర భీకర దాడులు చేసుకుంటున్నాయి. 

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం