పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
దేశంలో పవర్ పెట్రోల్ ధర లీటర్‌పై రూ.2 పెరగ్గా, పారిశ్రామిక డీజిల్ ధర లీటర్‌పై రూ.87.67 నుంచి రూ.109.59కి పెరిగింది. అయితే ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరుగుతుండటం, దాని సరఫరాకు అంతరాయం కలుగుతున్న క్రమంలో సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలు కూడా అతి త్వరలోనే పెరగవచ్చని తెలుస్తోంది. అంతర్జాతీయంగా యుద్ద పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకోకపోతే ఇంధన ధరలు మరింత పెరిగే అవకాశముందని సమాచారం. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్దం, గల్ప్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ వరుస దాడుల క్రమంలో దేశంలో ఇప్పటికే గ్యాస్ ధరలు పెరగ్గా.. పెట్రోల్, డీజిల్ ధరలు కూడా క్రమక్రమంగా పెరుగుతున్నాయి. పవర్ పెట్రోల్, పారిశ్రామిక పెట్రోల్ ధరలను పెంచడం చూస్తే.. కొద్ది రోజుల్లో నార్మల్ పెట్రోల్ ధరలు కూడా పెంచే అవకాశం లేకపోలేదు. దేశంలో ముడి చమురు ధరలు ఆకాశాన్నంటుతుండటంతో రానున్న కొద్ది రోజుల్లో డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగే ఛాన్స్ ఉంది. ఇతర దేశాల్లో ఇప్పటికే ధరలు పెరగ్గా.. భారత్‌లోనూ పెరుగుతాయని బిజినెస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే దేశంలో వరుసగా రెండో రోజు పెట్రోల్ ధరలు ఎగబాకాయి. రెండు రోజుల్లో నార్మల్ పెట్రోల్‌పై లీటర్‌కు 40 పైసలకుపైగా పెరిగింది.
Comments
Post a Comment