వైఎస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన అంబటి రాంబాబు
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మాజీ మంత్రి అంబటి రాంబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. బెయిల్‌పై విడుదలైన అనంతరం తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లిన అంబటి, ఇటీవల తనపై జరిగిన దాడికి సంబంధించిన వివరాలను జగన్‌కు వివరించారు. ఈ సందర్భంగా అంబటికి జగన్ ధైర్యం చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు తప్పుడు కేసులకు భయపడాల్సిన అవసరం లేదని, చట్టపరంగా అన్నింటినీ ఎదుర్కొందామని భరోసా ఇచ్చారు. ప్రజా పక్షాన పోరాటం చేసేటప్పుడు ఇలాంటి అడ్డంకులు ఎదురవుతాయని, వాటిని ధైర్యంగా ఎదుర్కొని ప్రజల వెంటే ఉండాలని పిలుపునిచ్చారు. పార్టీ కేడర్ ఎవరూ ఆందోళన చెందవద్దని, వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని జగన్ స్పష్టం చేశారు.
Comments
Post a Comment