తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాలు : సమస్యల పరిష్కారానికి నోడల్ ఆఫీసర్స్


తెలంగాణలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన వసతులు కల్పించడంతో పాటు విద్యార్థులకు ఏమైనా ఇబ్బందులు ఏర్పడితే వాటిని వేగంగా పరిష్కరించడంతో పాటు మెరుగైన పర్యవేక్షణ చేయాలని జిల్లా అధికారులను ప్రభుత్వం ఆదేశించించింది. క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించడానికి నోడల్ అధికారులను నియమించాలని ఈ మేరకు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. డిటైల్డ్ ఎంక్వైరీ క్యాలెండర్‌ను ముందుగానే తయారు చేసి వాటిని జిల్లా షెడ్యూల్‌కు అనుగుణంగా సంబంధిత అన్ని విభాగాలకు అందజేయాలని స్పష్టం చేసింది. నోడల్ అధికారులు నిర్ణీత షెడ్యూల్ ప్రకారం తనిఖీలు నిర్వహించాలని విద్యా సంస్థల సరైన పనితీరును నిర్ధారించడానికి ఆకస్మిక సందర్శనలను కూడా నిర్వహిస్తారని ఈ ఆదేశాల్లో వెల్లడించింది. అధికారులు గురుకుల పాఠశాలలను సందర్శించిన తర్వాత అవసరమైన చర్యలు తీసుకోవడానికి తనిఖీ నివేదికలను తయారు చేసి వెంటనే అప్‌లోడ్ చేయాలని పేర్కొంది. ఏ చర్యలు తీసుకున్నారో వెంటనే తెలియజేయాలని జిల్లా అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. తీసుకున్న చర్యల నివేదికను ప్రతి నెల అయిదో తేదీలోపు సంబంధిత విభాగాధిపతులు, కార్యదర్శులకు తప్పకుండా సమర్పించాలని ఆదేశాల్లో పేర్కొంది. 

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం