విశాఖపట్నం ఈఎస్ఐఎస్ ఆస్పత్రి మెడికల్ కాలేజీగా అప్ గ్రేడ్
ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో ఉన్న ఈఎస్ఐఎస్ ఆసుపత్రి అప్గ్రేడ్ చేయడం ద్వారా మరో కొత్త మెడికల్ కళాశాల రాష్ట్రానికి రానుంది. వైద్య విద్యను, ప్రజారోగ్య సేవలను విస్తరించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రధానంగా కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా ఈఎస్ఐ, ఈఎస్ఐఎస్ ఆసుపత్రులను మెడికల్ కళాశాలలుగా మార్చడానికి కేంద్రం కసరత్తు చేస్తున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి విశాఖపట్నంలోని ఈఎస్ఐఎస్ ఆస్పత్రికి ఆ అవకాశం లభించింది. ఇటీవల పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాజ్యసభలో కేంద్ర కార్మిక సహాయ మంత్రి శోభ కరందాజ్లే ఈ విషయంపైన స్పష్టత నిచ్చారు. జాతీయ వైద్య మండలి నిబంధనలకు అనుగుణంగా విశాఖపట్నంలోని ఈ ఎస్ ఐ ఎస్ ఆసుపత్రిని అప్గ్రేడ్ చేస్తున్నామని ఆమె రాజ్యసభ వేదికగా ధ్రువీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆసుపత్రిని అప్పగించిన వెంటనే తదుపరి చర్యలు ప్రారంభిస్తామని మంత్రి పేర్కొన్నారు. దీంతో ఇప్పటికే ఈఎస్ఐఎస్ ఆసుపత్రిని కేంద్ర ప్రభుత్వానికి అప్పగించే ప్రక్రియను ఏపీ ప్రభుత్వం మొదలుపెట్టింది. ప్రస్తుతం సిబ్బంది, నిర్వహణ ఖర్చులు, ఇతర కీలక అంశాలపైన కేంద్రంతో చర్చలు సాగుతున్నాయి. ఈ అప్ గ్రేడేషన్ పనుల కోసం జనవరి నెలలో కేంద్ర ప్రభుత్వ బృందం విశాఖపట్నంలోని ఈఎస్ఐఎస్ ఆసుపత్రిని సందర్శించి పరిశీలన జరిపింది.
Comments
Post a Comment