ప్రతిపక్ష సభ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్పీకర్ ఓం బిర్లాకు బీజేపీ మహిళా ఎంపీలు లేఖ


లోక్ సభలో ఫిబ్రవరి 4న రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతున్న సమయంలో చోటుచేసుకున్న దురదృష్టకర సంఘటనలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్పీకర్ ఓం బిర్లాకు బీజేపీ మహిళా ఎంపీలు లేఖ రాశారు. అందులో ప్రజాస్వామ్య వ్యవస్థల ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరించిన ఎంపీలపై నిబంధనల ప్రకారం అత్యంత కఠినమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ముందస్తు పధకం ప్రకారం సభలో విపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకురావడమే కాకుండా, స్పీకర్ టేబుల్‌పైకి ఎక్కి కాగితాలు చింపి విసిరేశారని లేఖలో పేర్కొన్నారు. ముఖ్యంగా, కొందరు మహిళా ఎంపీలు ప్లకార్డులతో ట్రెజరీ బెంచీల వైపు దూసుకు వచ్చి, ప్రధాని మోడీ సీటును చుట్టుముట్టడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. సీనియర్ మంత్రులు కూర్చునే ప్రదేశం లోకి ప్రవేశించి అరాచక వాతావరణాన్ని సృష్టించారని, ఇది సభా మర్యాదలకు పూర్తిగా విరుద్ధమని ఆ లేఖలో మహిళా ఎంపీలు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ప్రతిపక్ష ఎంపీల ప్రవర్తనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికి సభ గౌరవాన్ని, పవిత్రతను కాపాడేందుకు స్పీకర్ ఓం బిర్లా వ్యవహరించిన తీరును మహిళా ఎంపీలు కొనియాడారు. అయితే, భవిష్యత్తులో ఇటువంటి హేయమైన చర్యలు పునరావృతం కాకుండా ఉండాలంటే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడం ఒక్కటే మార్గమని వారు స్పష్టం చేశారు. ఈ లేఖ పార్లమెంటరీ వర్గాల్లో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం