అమెజాన్‌ గ్రేట్‌ రిపబ్లిక్ డే సేల్‌ : శాంసంగ్ గెలాక్సీ M17 5G స్మార్ట్‌ఫోన్‌పై డిస్కౌంట్‌ ఆఫర్


మెజాన్‌ గ్రేట్‌ రిపబ్లిక్ డే సేల్‌ 2026 లో అనేక స్మార్ట్‌ఫోన్‌ లపై డిస్కౌంట్‌ లను అందిస్తోంది. శాంసంగ్ గెలాక్సీ M17 5G స్మార్ట్‌ఫోన్‌ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.12,999, 6GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ ధర రూ.13,999, 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ వేరియంట్ రూ.15,499 గా ఉంది. దీంతోపాటు SBI క్రెడిట్‌ కార్డుపై 10 శాతం డిస్కౌంట్‌ ను పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌ సాప్ఫిర్ బ్లాక్‌, మూన్‌ లైట్‌ సిల్వర్‌ కలర్‌ వేరియంట్స్‌ లో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 7.5mm థిక్‌నెస్‌ ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 6.7 అంగుళాల సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌ ను పొందుతోంది. IP54 రేటింగ్‌ తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌ గా ఉంది. 25W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. శాంసంగ్‌ గెలాక్సీ M17 5G స్మార్ట్‌ఫోన్‌ Exynos 1330 ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత OneUI 7 పైన పనిచేస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ బడ్జెట్ ధరలో అందుబాటులోకి వచ్చినా 6 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ పొందుతుందని శాంసంగ్‌ తెలిపింది. వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలు ఉన్నాయి. ఇందులో ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా ఉంది. దీంతోపాటు 5MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ లెన్స్‌, 2MP మ్యాక్రో లెన్స్‌ ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 13MP కెమెరాను కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, వైఫై, బ్లూటూత్, NFC, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది. సర్కిల్‌ టూ సెర్చ్, ట్యాప్ అండ్‌ పే ఫీచర్‌ తో శాంసంగ్‌ వాలెట్‌, Knox Vault, వాయిస్‌ మెయిల్, వాయిస్ ఫోకస్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. 

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం