16న కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామక పత్రాల జారీ


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానిస్టేబుల్ అభ్యర్థులకు ఈ నెల 16న నియామక పత్రాలు జారీ చేయనుంది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్ ను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఈరోజు సందర్శించారు. 16న జరగనున్న కానిస్టేబుల్ అభ్యర్థుల నియామక పత్రాల జారీ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత పోలీస్ ఉన్నతాధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో పర్యటించారు. సభా వేదిక నిర్మాణం, వేదికకు చేరుకునే మార్గాలు, పార్కింగ్ సౌకర్యాలు, వీవీఐపీ, వీఐపీలకు ఏర్పాటు చేసే వసతులు, ఇతర జిల్లాల నుండి హాజరయ్యే అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు, బందోబస్తుకు వచ్చే పోలీస్ అధికారులు, సిబ్బందికి కల్పించాల్సిన సౌకర్యాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు.  ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని, కార్యక్రమాన్ని సజావుగా, విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో కృషి చేయాలని మంత్రి అనిత కోరారు. తగినంత పోలీస్ బలగాలతో సమర్థవంతమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని హోం మంత్రి పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఐజీ సత్య యేసు బాబు, గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఐపీఎస్, బెటాలియన్ కమాండెంట్ (ఎస్పీ) నగేష్ ఐపీఎస్, జిల్లా అదనపు ఎస్పీ ఏటీవీ రవికుమార్, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం