తెలంగాణలో పతనమైన పగటి, రాత్రిపూట ఉష్ణోగ్రతలు


తెలంగాణలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పతనమయ్యాయి. పొడి వాతావరణ ప్రభావంతో తగ్గుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్‌ మేర ఉష్ణోగ్రతలు పడిపోయాయి. అక్టోబర్‌ నెలాఖరుకల్లా ఉష్ణోగ్రతలు తగ్గుదల నమోదు కావాల్సి ఉండగా.. ఈసారి కాస్తా ఆలస్యంగానే ఉష్ణోగ్రతల పతనం నమోదైంది. దీంతో చలి ప్రభావం కనిపిస్తుంది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రత పడిపోయింది. లింగపూర్‌లో 15.2 డిగ్రీలుగా ఉంది. జిల్లాలోని పలు గ్రామాలను ఉదయం పొగ మంచు కమ్మేసింది. ఉదయం 8 అయిన సూర్యోదయం కనిపించలేదని అక్కడి స్థానికులు చెప్తున్నారు. దీంతో చలి ప్రభావం వల్ల వాహనదారులు లైట్లు వేసుకొని ప్రయాణం సాగించారు. వృద్ధులు, పిల్లలు చలి తీవ్రతకు ఇంట్లో నుండి బయటకు రావడానికి జంకుతున్నారు. ప్రస్తుతానికి ఎలాంటి వాతావరణ హెచ్చరికలు లేవని అధికారులు అంటున్నారు. వాతావరణంలో నెలకొనే మార్పులతో అక్కడక్కడా తేలికపాటి వానలు కురుసే అవకాశం ఉందని.. ఈ పరిస్థితుల్లో ఉష్ణోగ్రతలు పతనం క్రమంగా ఉంటుదని వాతావరణ శాఖ అధికారులు వివరిస్తున్నారు.

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం