ఢిల్లీ మెట్రో స్టేషన్ లో బాక్సుల కొద్దీ కండోమ్స్ ప్రత్యక్షం !
ఢిల్లీలోని మెట్రో స్టేషన్ లో బాక్సుల కొద్దీ కండోమ్స్ ప్రత్యక్షం కావడం కలకలం రేపుతోంది. మెట్రో స్టేషన్ గేటు వెనకాల ఓ బాక్సును గుర్తించాడు ఓ ప్రయాణికుడు. ఏంటని ఓపెన్ చేసి చూడగా బాక్సు నిండా కండోమ్స్ ఉన్నాయి. దీంతో అతడితోపాటు తోటి ప్రయాణికులు షాక్ అయ్యారు. వీటిని ఎవరు ఇక్కడ పెట్టారని ప్రశ్నలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అయితే గతంలో ఢిల్లీ మెట్రో ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమంలో భాగంగా ఉచితంగా కండోమ్స్ పంపిణీ చేసింది. అయితే తాజాగా ఈ ఘటన జరిగిన క్రమంలో ఆ కార్యక్రమాన్ని గుర్తు చేసుకుంటున్నారు. 2014 లో ఢిల్లీ మెట్రో సంస్థతో కలిసి నిరోధ్ అనే సంస్థ కండోమ్స్ పై ప్రజల్లో అవగాహన కల్పించింది. ఢిల్లీలోని అనేక మెట్రో స్టేషన్స్ లో కండోమ్స్ వెండింగ్ మెషీన్స్ ను ఏర్పాటు చేసింది. వీటితో వినియోగించిన కండోమ్స్ ను రీసైక్లింగ్ చేసి ఓరల్ కంట్రాసెప్టివ్స్, శానిటరీ న్యాప్ కిన్స్ ను తయారీకి వినియోగించారు. నిరోధ్ కండోమ్స్ ను 1960 ల్లో వాడుకలోకి తీసుకొచ్చారు. సెక్సువల్లీ ట్రాన్స్ మిట్టెడ్ ఇన్ ఫెక్షన్స్ బారి నుంచి పడకుండా వీటిని వినియోగిస్తున్నారు. ప్రభుత్వ ఆరోగ్య సెంటర్లలో వీటిని ఉచితంగా అందజేస్తున్నారు.
Comments
Post a Comment