జమిలి ఎన్నికలకు సిద్ధమవుతున్న కేంద్ర ప్రభుత్వం ?


2027 ఫిబ్రవరిలో ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. జమిలి ఎన్నికలకు మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ గారి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేశారు.కమిటీ కూడా పూర్తి స్థాయిలో పరిశీలన జరిపి తన నివేదికను కేంద్ర ప్రభుత్వంకు అందజేసింది. జమిలి ఎన్నికలు జరగాలి అంటే రాజ్యాంగంలో 5 ఆర్టికల్స్ (ఆర్టికల్ 83,85,172,174,356) లు రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా చేయాలని సూచించింది. ఈ బిల్లు ఆమోదం పొందాలంటే లోక్ సభ, రాజ్య సభ లో 67% మంది మద్దతు ఇవ్వాలి, 14 రాష్ట్ర అసెంబ్లీలు మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. అలా మద్దతు ఇస్తే బిల్లు ఆమోదం పొంది జమిలి ఎన్నికలు సాధ్యం అవుతాయి. ఈ బిల్లును ఈ శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. ఈ బిల్లుకు పార్లమెంట్ లో మద్దతు లభిస్తే 2027 ఫిబ్రవరిలో ఉత్తర ప్రదేశ్ ఎన్నికలతో పాటు దేశం మొత్తం అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు నిర్వహిస్తుంది.ఈ ఎన్నికలు జరిగిన వంద రోజుల తర్వాత మున్సిపల్,గ్రామ పంచాయితి ఎన్నికలు నిర్వహిస్తుంది. దేశం మొత్తం పరిపాలన సౌలభ్యం కొరకు ఈ జమిలి ఎన్నికలు జరపనున్నట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద జోషీ  తెలిపారు. అయితే ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా వంటి రాష్ట్రాల్లోని ప్రభుత్వాలకు 2029 వరకు గడువు  ఉంది. రెండేళ్ల పరిపాలనను రద్దు చేసుకుని ఎన్నికలు వెళ్తాయా అన్నది ఇక్కడ అసలు ప్రశ్న. 


Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం