పవన్ కళ్యాణ్‌కు కార్తి క్షమాపణలు !


త్యం సుందరం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కార్తి చేసిన వ్యాఖ్యలపై పవన్ సీరియస్ అయ్యాడు. తాజాగా దీనిపై కార్తి స్పందిస్తూ పవన్ కళ్యాణ్‌కు క్షమాపణ చెప్పాడు. పవన్‌కల్యాణ్‌పై తనకు అమితమైన గౌరవం ఉంది. అనుకోని అపార్థానికి క్షమాపణ కోరుతున్నానని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. నేనూ కూడా వేంకటేశ్వరస్వామి భక్తుడినని, ఎల్లప్పుడూ మన సంప్రదాయాలను గౌరవిస్తానని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ తెగ వైరల్ అవుతుంది. లడ్డూ కల్తీ ఘటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టాడు.  లడ్డు గురించి పలువురు ఆర్టిస్టులు చేస్తున్న వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించాడు. రీసెంట్‌గా సత్యం సుందరం ఈవెంట్‌లో లడ్డూ కావాలా నాయనా అనే మీమ్‌పై కార్తి స్పందిస్తూ ఇప్పుడు లడ్డూ గురించి వద్దు. ఆ టాపిక్ చాలా సెన్సిటీవ్ అని సమాధానం ఇచ్చాడు. దీనిపై పవన్ కళ్యాణ్ ఫైర్ అవుతూ.. లడ్డూ మీద జోక్స్ వేస్తున్నారు. ఓ సినిమా ఈవెంట్‌లో లడ్డూ అనేది సెన్సిటీవ్ ఇష్యూ అని ఓ హీరో అన్నాడు. మళ్లీ ఇంకోసారి అలా అనవద్దు. నటుడిగా మీరంటే నాకెంతో గౌరవం. సనాతన ధర్మాన్ని గౌరవించండి. ఏదైనా మాట్లాడే ముందు వందసార్లు ఆలోచించండి అని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం