నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌ నుంచి 26 గేట్లు ఎత్తివేత !


నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతుంది. మొత్తం 26 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 2లక్షల, 73వేల, 370 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 585.40 అడుగులకు చేరుకుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుత నిల్వ సామర్థ్యం 298.58 టీఎంసీలకు చేరుకుంది. మరోవైపు పులిచింతల ప్రాజెక్టు నిండుకుండలా మారింది. పులిచింతల ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో : 2,45, 682 క్యూసెక్కులు. ప్రస్తుతం ప్రాజెక్టుకు సంబంధించిన 11 గేట్లు ఎత్తి అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం