స్వల్ప లాభాలతో ముగిసిన సూచీలు !


దేశీయ స్టాక్‌ మార్కెట్లలో బుధవారం తీవ్ర ఊగిసలాట కన్పించింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ దేశీయంగా దిగ్గజ షేర్లలో కొనుగోళ్ల అండతో ఈ ఉదయం సూచీలు ఉత్సాహంగా కన్పించాయి. బుధవారం రాత్రి జరగబోయే అమెరికా ఫెడ్‌ సమావేశంపై దృష్టిపెట్టిన మదుపర్లు ఆ తర్వాత లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. దీంతో జీవనకాల గరిష్ఠాల నుంచి వెనక్కి వచ్చిన మార్కెట్లు స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 150 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ తొలిసారి 23,300 మార్క్‌పైన స్థిరపడింది. ఈ ఉదయం జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ 23,344 పాయింట్ల వద్ద ఉత్సాహంగా ప్రారంభమైంది. ఉదయం సెషన్‌ మొత్తం అదే జోరు కొనసాగించిన సూచీ ఇంట్రాడేలో ఏకంగా 177.1 పాయింట్లు పెరిగి 23,441.95 వద్ద సరికొత్త జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. అదే సమయంలో అటు సెన్సెక్స్‌ కూడా దాదాపు 600 పాయింట్లు పెరిగి ఇంట్రాడేలో 77,050.53 గరిష్ఠ స్థాయిని చేరింది. అయితే, మధ్యాహ్నం తర్వాత మదుపర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు. దీంతో ఒత్తిడికి గురైన సూచీలు రికార్డు స్థాయి నుంచి వెనక్కి వచ్చాయి. చివరకు మార్కెట్‌ ముగిసే సమయానికి నిఫ్టీ 58.10 పాయింట్ల లాభంతో 23,322.95 వద్ద, సెన్సెక్స్‌ 149.98 పాయింట్లు పెరిగి 76,606.57 వద్ద ముగిశాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 3 పైసలు పెరిగి 83.56 వద్ద స్థిరపడింది. నిఫ్టీలో కోల్‌ ఇండియా, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఐషర్‌ మోటార్స్‌, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్స్యూరెన్స్‌, టెక్‌ మహీంద్రా షేర్లు రాణించాయి. మహీంద్రా అండ్‌ మహీంద్రా, హిందుస్థాన్‌ యునిలివర్‌, టాటా కన్స్యూమర్‌ ప్రొడక్ట్స్‌, టైటాన్‌ కంపెనీ షేర్లు నష్టపోయాయి.

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం