నా భర్తను వెతికి పెట్టండి!


కెనడాలోని మాంట్రియల్‌లో ఉంటున్న దీప్తిరెడ్డి అనే వివాహిత మూడు నెలల నుంచి తన భర్త కనిపించడం లేదని భారత విదేశాంగ శాఖకు ట్విటర్‌లో తెలిపింది. మూడు నెలల కిందట తన భర్త తనను వదిలేసి ఇండియా వచ్చేశారని వాపోయింది. ప్రస్తుతం, తాను రెండు నెలల గర్భవతి అని వెల్లడించింది. తన భర్త అనుగుల చంద్రశేఖర్‌ రెడ్డి కెనడాలో మెక్‌గ్రిల్‌ యూనివర్సిటీలో రసాయన శాస్త్రవిభాగంలో పనిచేసేవారని తెలిపింది. ఎలాగైన తన భర్త ఆచూకీ తెలుసుకోవాలని ట్విటర్‌ ద్వారా దీప్తి కోరింది. ఆగస్టు 9 నుంచి తన భర్త ఆచూకీ లేదని, తాను భారత హైకమిషన్‌కు 2021 ఆగస్టు 20న ఫిర్యాదు చేశానని తెలిపింది. ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదని తన ట్వీట్‌లో తెలియజేసింది. కాగా, తన బావ శ్రీనివాస్‌ రెడ్డి చైతన్యపురిలో కానిస్టేబుల్‌గా పనిచేస్తుంటారని దీప్తి పేర్కొంది. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి బాగోలేదని, తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నానని ట్విటర్‌లో వాపోయింది. దీప్తి వినతి మేరకు స్పందించిన విదేశాంగ శాఖ రాచకొండ పోలీసులకు సమాచారం ఇచ్చింది. రంగంలోకి దిగిన రాచకొండ పోలీసులు చంద్రశేఖర్‌ రెడ్డి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం