Posts

యాప్‌ను నమ్మి విడతల వారీగా డబ్బులు జమ చేసి రూ.1.68 లక్షలను మోసపోయిన మహిళ !

Image
తె లంగాణలోని కామారెడ్డి జిల్లాలోని దోమకొండ మండల కేంద్రానికి చెందిన మహిళ ఓ యాప్‌ను నమ్మి అందులో విడతల వారీగా డబ్బులు జమ చేసింది. గత మూడు నెలలుగా యాప్‌లో టాస్క్‌ చేస్తూ వారు కోరిన విధంగా డబ్బులు పంపింది. తాను పెట్టుబడిన పెట్టిన డబ్బులు కంటే ఎక్కువ మొత్తంలో డబ్బులు జమ అయినట్లు ఆ యాప్‌లో సైబర్ మోసగాళ్లు మహిళకు చూపించారు. దీంతో అదంతా నిజమే అని నమ్మి మరికాస్త డబ్బులను జమ చేసింది. చివరకు యాప్‌లో ఉన్న డబ్బులను డ్రా చేయాలని చూసింది. కానీ డబ్బులు డ్రా అవ్వలేదు. దీంతో తాను మోసపోయినట్లు మహిళ గ్రహించింది. దాదాపు రూ.1.68 లక్షలను బాధితురాలు మోసపోయింది. ఈ వ్యవహారంపై స్థానిక పోలీసులను ఆశ్రయించి తాను ఏ విధంగా మోసపోయిందనే విషయాన్ని బాధితురాలు తెలియజేసింది. కేసు నమోదు చేసిన దోమకొండ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

అదుపుతప్పి లోయలో పడిన బస్సు : ఏడుగురు మృతి, పలువురికి తీవ్ర గాయాలు

Image
ఉ త్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లాలో మంగళవారం ఉదయం  భికియాసైన్ నుండి రామ్‌నగర్ వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సు అదుపుతప్పి వినాయక్ ప్రాంతంలోని ఒక లోయలో పడింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో సుమారు 18 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో ఏడుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల సమాచారం ప్రకారం ప్రమాదానికి గురైన బస్సు తెల్లవారుజామున సుమారు 6 గంటలకు ద్వారహత్ నుండి బయలుదేరింది. ఉదయం 8 గంటల ప్రాంతంలో శైలాపాని సమీపంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు వందల అడుగుల లోయలోకి పడిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. బస్సు నుజ్జునుజ్జు కావడంతో ప్రయాణికులు అందులో చిక్కుకుపోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

వ్యక్తిపై ఆకస్మికంగా పులి దాడి : మంచంపైకి ఎక్కి గంటల తరబడి విశ్రమించిన పులి

Image
మ ధ్యప్రదేశ్‌లోని బంధవ్‌గఢ్‌ టైగర్‌ రిజర్వ్‌ సమీపంలోని ఒక గ్రామంలోకి అర్ధరాత్రి సమయంలో ఒక పులి ప్రవేశించింది. ఇంటి బయట ఉన్న గోపాల్ కోల్ అనే వ్యక్తిపై ఆకస్మికంగా దాడి చేసి గాయపరిచింది. అయితే, ఆ తర్వాత అడవిలోకి వెళ్లకుండా, అదే ఇంటి ఆవరణలో ఉన్న మంచంపైకి ఎక్కి గంటల తరబడి విశ్రాంతి తీసుకుంది. మంచంపై పులి తిష్ట వేయడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలు కాపాడుకోవడానికి వారంతా ఇళ్ల పైకప్పుల పైకి ఎక్కి గంటల తరబడి గడిపారు. పులి మంచంపై పడుకుని ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. సుమారు 8 గంటల పాటు శ్రమించి, పులిని సురక్షితంగా బంధించి తిరిగి అడవిలో విడిచిపెట్టారు. పులి దాడిలో గాయపడిన గోపాల్ కోల్‌ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

విమాన ప్రయాణికుడిపై దాడి చేసిన ఎయిరిండియా పైలెట్ అరెస్టు !

Image
ఢి ల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్పైస్‌జెట్ విమాన ప్రయాణికుడిపై దాడి చేసిన కేసులో ఎయిరిండియా పైలెట్‌ వీరేందర్ సెజ్వాల్ ను పోలీసులు అరెస్టు చేశారు. కేంద్ర పౌర విమానయాన శాఖ ఆదేశం మేరకు ఢిల్లీ ఎయిర్‌పోర్టు పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. ప్రయాణికుడిపై దాడి కేసులో అరెస్టయిన వెంటనే నిందితుడికి బెయిల్ మంజూరైంది. ఈ ఘటనతో ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ సంస్థ పైలట్‌ను ఇప్పటికే విధుల నుంచి తొలగించింది. దాడి ఘటన గురించి ప్రయాణికుడు అంకిత్‌ దివాన్‌ సామాజిక మాధ్యమంలో పోస్ట్‌ చేయగా విమానయాన సంస్థ ఈ చర్య తీసుకుంది. తన కుటుంబంతో కలిసి స్పైస్‌జెట్‌ విమానంలో ప్రయాణించేందుకు ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు వచ్చానని, టెర్మినల్‌-1లో సెక్యూరిటీ చెక్‌-ఇన్‌ వద్ద లైన్‌లో ఉండగా, కొందరు లైన్‌ మధ్యలోకి రావడంపై ప్రశ్నించానని వీడియో ద్వారా అంకిత్‌ దివాన్‌ వెల్లడించారు. ఇలా ప్రశ్నించినందుకుగాను ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ పైలట్‌ వీరేందర్‌ సెజ్వాల్‌ దుర్భాషలాడడంతో పాటు తనపై భౌతిక దాడి చేశాడని వీడియోలో పేర్కొన్నాడు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో ఈ ఘటనపై దర్యాప్తు చేసి, నివేదిక సమర్పించాల్సిందిగా బ్యూరో ఆఫ్‌ ...

ఎస్సీ బాలికల గురుకులంలో డిగ్రీ విద్యార్థినిని చితకబాదిన వార్డెన్ భవానీని సస్పెండ్ చేసిన కలెక్టర్

Image
తె లంగాణలోని భూపాలపల్లి ఎస్సీ బాలికల గురుకులంలో డిగ్రీ విద్యార్థినిని చితకబాదిన వార్డెన్ భవానీని కలెక్టర్ సస్పెండ్ చేశారు. వార్డెన్‌పై పలు ఆరోపణల నేపథ్యంలో పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని డీడబ్ల్యూఓని ఆదేశించారు. ఎస్సీ బాలికల గురుకులంలో డిగ్రీ విద్యార్థినిని వార్డెన్ చితకబాదిన వీడియో ఒకటి తాజాగా వైరల్‌గా మారింది. ఎగ్జిట్‌ అయి చెప్పి పోయినవ్‌ కదా హాస్టల్‌లో ఎగ్జిట్‌ పన్నెండింటికి అయిపోతది. మళ్లీ ఎగ్జిట్‌ అయిపోయే టైం హాస్టల్‌ ఉండాలన్న సోయి లేదా నీకు అంటూ వార్డెన్‌ ఓ వైపు కర్ర, మరోవైపు చేతులతో విద్యార్థినిని చితకబాదింది. ఆ సమయంలో అక్కడే ఉన్న తోటి విద్యార్థినులు వీడియో తీశారు. గత 24న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా వైరల్‌గా మారింది. దీంతో వార్డెన్ తీరుపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. ఇదే కాకుండా ఇదే వార్డెన్ రెండు నెలల క్రితం విద్యార్థినులకు మత బోధనలు చేయించడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఈ రెండు ఘటనలను సీరియస్‌గా తీసుకున్న జిల్లా కలెక్టర్ వార్డెన్ భవానీని సస్పెండ్ చేశారు.

వ్యాపారస్థుడ్ని చితకబాదిన ఎస్‌ఐ : దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేసి బంద్‌ పాటించిన వ్యాపారస్తులు

Image
ఆం ధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా పొదిలి ఎస్‌ఐ వేమన వ్యవహారశైలిపై జనం తిరగబడ్డారు. ఓ వ్యాపారస్థుడ్ని విచక్షణారహితంగా కొట్టడమే కాకుండా బూతులు తిట్టారంటూ ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు. దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేసి బంద్‌ పాటించారు. ఓ షాపు ముందు లారీ ఆగినందుకు రోడ్డుకు అడ్డంగా ఉందంటూ తొలుత లారీ డ్రైవర్‌పై చేయిచేసుకోవడమే కాకుండా షాపు యజమానులైన తండ్రీ కొడుకులను చితకబాది తప్పుడు కేసులు పెట్టేందుకు ప్రయత్నించారంటూ ఆరోపించారు. గతంలో కూడా ఎస్‌ఐ వేమన సివిల్‌ తగాదాల్లో తలదూర్చి బాధితులను విచక్షణా రహితంగా కొట్టారంటూ ఆరోపిస్తున్నారు. తాజాగా పొదిలిలో తమకు న్యాయం చేయాలంటూ బాధితులతో కలిసి ఆర్యవైశ్య సంఘాలు పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు. మూడు రోజుల క్రితం లారీ అన్లోడింగ్ విషయంలో అన్యాయంగా పరిధి దాటి ఎరువుల షాపు వ్యాపారి యదాల కోటేశ్వరరావు, ఆయన కుమారుడు అవినాష్ ను పొదిలి ఎస్‌ఐ వేమన విచక్షణారహితంగా కొట్టి తీవ్రంగా గాయపర్చారని బాధితులు తెలిపారు. ఎస్‌ఐ కొట్టిన దెబ్బలకు ట్రీట్‌మెంట్‌ కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే అక్కడ ట్రీట్‌ మెంట్ తీసుకుంటే మెడికో లీగల్‌ కేసు ఎస్‌ఐపై పెట్టాల...

ఆధిపత్యం కోసం కారుతో ఢీకొట్టి, కత్తులతో నరికి చంపిన ప్రత్యర్థులు

Image
ఆం ధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నారాకోడూరులో ఆధిపత్యం కోసం గత కొంతకాలంగా రెండు కుటుంబాల మధ్య వివాదం నడుస్తుంది. ఇందులో భాగంగా ప్రత్యర్ధులను కాపు కాసి కిరాతకంగా హత్య చేశారు. నారాకోడూరులోని ఎస్సీ కాలనీకి చెందిన రమణయ్య – రమేష్ కుటంబాల మధ్య ఎప్పటి నుండో విబేధాలున్నాయి. రమేష్ కుటుంబం టీడీపీలో ఉండగా గతంలో రమణయ్య కుటుంబం వైసీపీలో ఉండేది. గత ఎన్నికల్లో రమేష్ ఎంపీటీసీగా గెలుపొందారు. అప్పటి నుండి రెండు కుటుంబాల మధ్య మరింతగా విబేధాలు పొడచూపాయి. అయితే గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు రమణయ్య కుటుంబం కూడా టీడీపీలో చేరిపోయింది. రెండు కుటుంబాల ప్రస్తుతం టీడీపీలోనే ఉంటున్నాయి. అయితే కాలనీలో రమేష్ కుటుంబ పెత్తనమే సాగుతుంది. ఈ క్రమంలోనే రమణయ్య కుటుంబ సభ్యులు రమేష్ కుటుంబంపై కక్ష పెంచుకున్నారు. కాలనీలో తమ పెత్తనం సాగాలంటే రమేష్ కుటుంబంలో కీలకంగా ఉన్న మృత్యుంజయరావును అడ్డుతొలగించుకోవాలని అనుకున్నారు. మృత్యుంజయరావు గజవెల్లి స్పిన్నింగ్ మిల్లులో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. ప్రతి రోజు పని అయిపోయాక స్పిన్నింగ్ మిల్లు నుండి ఇంటికి బైక్‌పై వచ్చేవాడు. దీన్ని ఆసరగా చేసుకొని ప్రత్యర్ధులు అతడిని అంతం చ...