Posts

Showing posts with the label who want a sunroof feature no longer need to spend lakhs of rupees extra

i20 లైనప్‌లో కొన్ని కీలక మార్పులు చేసి ధరలను సవరించిన హ్యుందాయ్

Image
హ్యుం దాయ్ ఇండియా i20 లైనప్‌లో కొన్ని కీలక మార్పులు చేస్తూ ధరలను సవరించింది. సన్‌రూఫ్ ఫీచర్ కావాలనుకునే వారు ఇకపై లక్షలు అదనంగా ఖర్చు చేయాల్సిన పనిలేదు. కేవలం రూ.6.99 లక్షలకే ఆ లగ్జరీ సొంతం చేసుకోవచ్చని కంపెనీ ప్రకటించింది. మారుతి సుజుకి బాలెనో, టాటా ఆల్ట్రోజ్ వంటి ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చేలా హ్యుందాయ్ ఈ వ్యూహాత్మక అడుగు వేసింది. కొత్తగా ప్రవేశపెట్టి ఎరా వేరియంట్ ఇప్పుడు బేస్ మోడల్‌గా మారింది. దీని ధర కేవలం రూ.5.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభం కానుంది. ధర తగ్గించినప్పటికీ, సేఫ్టీ విషయంలో హ్యుందాయ్ ఎక్కడా రాజీ పడలేదు. బేస్ వేరియంట్‌లో కూడా 6 ఎయిర్‌బ్యాగ్స్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టైప్-సి ఛార్జర్ వంటి ఆధునిక ఫీచర్లను అందిస్తోంది. దీనివల్ల బడ్జెట్‌లో కారు కొనాలనుకునే వారికి సెకండ్ హ్యాండ్ కార్ల వైపు చూడాల్సిన అవసరం లేకుండా పోయింది. చాలామంది కారు పైన సన్‌రూఫ్ ఉండాలని కోరుకుంటారు. అటువంటి వారి కోసం మాగ్నా వేరియంట్ ధరను రూ.6.99 లక్షలకు తగ్గించింది. ఈ మోడల్‌లో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌తో పాటు ఎల్‌ఈడీ డీఆర్ఎల్స్, రియర్ ఏసీ వెంట్స్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఇక మాగ్నా ఎగ్జిక్యూటి...