హిమాచల్ ప్రదేశ్‌లో ప్రాణాలు పణంగా పెట్టి చిన్నారిని కాపాడిన అంబులెన్స్ సిబ్బంది
హి మాచల్ ప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాలు ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు జిల్లాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. అలాంటి ప్రాణాంతక పరిస్థితుల్లో ఓ అంబులెన్స్ సిబ్బందిలోని వ్యక్తి చూపిన ధైర్యసాహసాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాయి. చంబా జిల్లాలో కొండచరియలు విరిగిపడి రహదారి పూర్తిగా దెబ్బతింది. ఆ సమయంలో తన ప్రాణాలను కూడా లెక్కచేయకుండా ఏడు నెలల చిన్నారిని అతను సురక్షిత ప్రాంతానికి చేర్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొండచరియలు విరిగిపడడంతో రహదారిపై భారీ బండరాళ్లు, మట్టి, శిథిలాలు పేరుకుపోయాయి. పైనుంచి మరికొన్ని రాళ్లు జారిపడుతున్నాయి. అయినా ఆ యువకుడు ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. చిన్నారిని గట్టిగా హత్తుకుని ప్రమాదకర ప్రాంతాన్ని అత్యంత జాగ్రత్తగా దాటించాడు. రాళ్లు పడని సమయం చూసి అక్కడి నుంచి వేగంగా పరిగెత్తుతూ చిన్నారిని మరో అంబులెన్స్ వద్దకు చేర్చాడు. ఆ తర్వాత చిన్నారి తల్లిదండ్రులు కూడా అవతలి వైపునకు పరిగెత్తుకుంటూ వెళ్లి అంబులెన్స్ వద్దకు చేరుకున్నారు. అనంతరం వారు వేగంగా ఆస్పత్రికి వెళ్లిపోయారు. అయితే, రోడ్డు...