Posts

Showing posts with the label video of the incident was shared on social media by Dan Scavino

పెళ్లి వేడుకల్లో నృత్యం చేసిన అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో

Image
అ మెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఓ వివాహ వేడుకకు హాజరై, అక్కడ డీజే ప్లే చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైట్‌హౌస్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ డాన్ స్కావినో సామాజిక మాధ్యం వేదికగా షేర్ చేశారు. ఎంతో బిజీ షెడ్యూల్‌తో ఉండే ఆయన ఇటీవల మియామీలోని ఒక నైట్ క్లబ్‍లో జరిగిన పెళ్లి వేడుకకు హాజరయ్యారు. పెళ్లికి హాజరైన వారిలో చాలా మంది అక్కడ ఏర్పాటు చేసిన డీజేకు అనుగుణంగా నృత్యం చేస్తూ కనిపించారు. దీంతో మార్క్ రుబియో కూడా డీజేను వాయించి డ్యాన్స్ చేసేవారిని మరింత ఉత్సాహపరిచారు. హెడ్ ఫోన్స్ ధరించి డీజే కన్సోల్‌ను ఆపరేట్ చేశారు. డీజే వద్దనే అందరితో పాటు ఆయన కూడా కాలు కదిపారు.