Posts

Showing posts with the label upcoming Kharif-2026 season in mind

ఎరువుల కొరత తీర్చేందుకు రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం

Image
ఇ రాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలో అన్నదాతకు అండగా నిలిచేందుకు భారత ప్రభుత్వం రంగంలోకి దిగింది. రానున్న ఖరీఫ్-2026 సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఎరువుల కొరత రాకుండా ఉండేందుకు దేశీయ ఉత్పత్తిని పెంచడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి దిగుమతులను వేగవంతం చేస్తూ బహుముఖ వ్యూహాన్ని అమలు చేస్తోంది. దేశీయంగా యూరియా ఉత్పత్తిని పెంచేందుకు కేంద్రం గ్యాస్ సరఫరాలో కీలక మార్పులు చేసింది. లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్‌ఎన్‌జీ) కొరత కారణంగా పూర్తిస్థాయి సామర్థ్యంతో పనిచేయలేకపోతున్న ప్లాంట్లకు ఊరటనిస్తూ ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. వంటగ్యాస్ అవసరాల తర్వాత గ్యాస్ సరఫరాలో ఎరువుల ప్లాంట్లకు రెండో ప్రాధాన్యత కల్పించారు. స్పాట్ మార్కెట్ నుంచి బిడ్డింగ్ ద్వారా అదనంగా 7.31 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్స్ పర్ డే(ఎంఎంఎస్‌సీఎండీ) గ్యాస్‌ను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదిరింది. దీనివల్ల ప్లాంట్లకు అందుతున్న గ్యాస్ సరఫరా 32 ఎంఎంఎస్‌సీఎండీ నుంచి 39.31 ఎంఎంఎస్‌సీఎండీకి (23 శాతం) పెరుగుతుంది. అమోనియాను విడిగా విక్రయించవద్దని దాన్ని పూర్తిగా యూరియా తయారీకే ఉపయోగించాలని కంపెనీలకు ఆదేశాలు జారీ అ...