Posts

Showing posts with the label total of 227 wards

బీఎంసీ ఎగ్జిట్ పోల్స్ : బీజేపీ-శివసేన కూటమి విజయం

Image
మ హారాష్ట్ర లోని బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌ (బీఎంసీ) ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమి విజయం దాదాపు ఖరారైనట్టుగా ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఆసియాలోనే అత్యంత సంపన్నమైన ఈ మున్సిపల్ సంస్థలో మొత్తం 227 వార్డులు ఉండగా, బీజేపీ-శివసేన కలిసి 130కిపైగా స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని అంచనా. ఆక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీ-శివసేన కూటమికి 131 నుంచి 151 సీట్లు రావొచ్చు. జేవీసీ ఎగ్జిట్ పోల్స్ కూడా కూటమి 138 వార్డులు దక్కించుకుంటుందని అంచనా వేసింది. ఏడు సంవత్సరాల తర్వాత జరిగిన ఈ ఎన్నికలు తీవ్ర పోటాపోటీగా సాగాయి. మారుతున్న కూటములు, వ్యూహాత్మక కలయికలు, మరాఠీ అస్మితపై పోరు ఎన్నికలను మరింత ఉత్కంఠభరితంగా మార్చాయి. ఇరవై ఏళ్ల తర్వాత ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే కలిసి పోటీ చేసినా ఆశించిన ఫలితం దక్కేలా కనిపించడం లేదు. ఆక్సిస్ మై ఇండియా అంచనా ప్రకారం శివసేన (యూబీటీ)-ఎంఎన్‌ఎస్ కూటమికి 58 నుంచి 68 సీట్లు రావొచ్చు. జేవీసీ ఎగ్జిట్ పోల్స్ అయితే ఈ కూటమికి 59 వార్డులు మాత్రమే వస్తాయని తేల్చి చెప్పింది. చివరి నిమిషంలో ప్రకాశ్ అంబేడ్కర్ నేతృత్వంలోని వంచిత్ బహుజన్ ఆఘాడీతో చేతులు కలిపినా.. కాంగ్రెస...