Posts

Showing posts with the label the manufacturing of defense equipment

మచిలీపట్నంలో రూ.8,000 కోట్లతో గోవా షిప్‌యార్డ్ ?

Image
ఆం ధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నంలో గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్  భారీ షిప్‌యార్డ్ ఏర్పాటుకు రూ.8,000 కోట్ల పెట్టుబడి ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తే ఏపీలో ఆధునిక యుద్ధనౌకల నిర్మాణం, రక్షణ సామగ్రి తయారీ, షిప్ రిపేర్ సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. గోవా వెలుపల మొదటిసారి ఇంత పెద్ద ఎత్తున విస్తరణకు సంస్థ సిద్ధమవుతోంది. మచిలీపట్నం పోర్ట్ ప్రాంతంలో ఈ గ్రీన్‌ఫీల్డ్ సౌకర్యం ఏర్పాటు చేయాలని జీఎస్‌ఎల్ ఒక ప్రతిపాదన సమర్పించింది. ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు తో ఇప్పటికే అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ వేగం పుంజుకుంటోంది. సుమారు 200 ఎకరాల భూమి కేటాయించాలని సంస్థ కోరినట్టు సమాచారం. ప్రభుత్వం ఈ విషయంపై సానుకూలంగా స్పందిస్తూ, నామినేషన్ లేదా టెండర్ ప్రక్రియ ద్వారా భూమి కేటాయింపు ఎలా చేయాలనే అంశంపై చర్చలు కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ షిప్‌యార్డ్ ఏర్పాటు వల్ల వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ప్రారంభ దశలోనే వేల మంది నేరుగా, పరోక్షంగా ఉపాధి పొందే అవకాశం ఉందని అంచనా. ఈ షిప్ యార్డ్ ఏర్పాటు జరిగితే ఇక్కడ ఉన్న నైపుణ్యం కలిగిన ఇంజనీర్లు, సాంకేతిక న...