Posts

Showing posts with the label the kidney racket was exposed

కిడ్నీ రాకెట్‌ను బట్టబయలు చేసిన మహారాష్ట్ర పోలీసులు

Image
మ హారాష్ట్రలో ఓ రైతు పంట కోసం బ్యాంకు నుంచి రుణం తీసుకున్నాడు. కానీ ప్రకృతి సహకరించలేదు. పంట దిగుబడి రాలేదు. తీసుకున్న వారి నుంచి ఒత్తిడి ఎక్కువైంది. ఆ సమయంలో ఇద్దరు వైద్యులు రైతుల్ని ఆశ్రయించారు. 'నీ కిడ్నీ ఇస్తే పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తాం' అని నమ్మించారు. అప్పుల భారంతో బాధపడుతున్న రైతు ఒప్పుకుని కిడ్నీ ఇచ్చాడు. అయితే ముందుగా చెప్పిన మొత్తాన్ని కాకుండా, కొంత మాత్రమే ఇచ్చారు. మోసపోయిన రైతు పోలీసులను ఆశ్రయించడంతో కిడ్నీ రాకెట్‌ బయటపడింది. చంద్రపూర్ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం పాన్‌-ఇండియా స్థాయిలో నడుస్తున్న కిడ్నీ రాకెట్‌ను బట్టబయలు చేసింది. ఈ రాకెట్‌లో భాగస్వాములైన ఇద్దరు వైద్యులు దేశవ్యాప్తంగా దాతల నుంచి కిడ్నీలను సేకరించి, వాటిని కాంబోడియా, చైనా సహా పలు దేశాల్లో విక్రయిస్తున్నట్లు తేలింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీలో పనిచేస్తున్న డాక్టర్‌ రవీందర్ పాల్ సింగ్, తిరుచిరాపల్లిలోని ఒక ప్రముఖ ఆస్పత్రి మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రాజరత్నం గోవిందస్వామి ఈ రాకెట్‌కు ప్రధాన సూత్రధారులుగా గుర్తించారు. ఈ కేసు వెలుగులోకి రావడానికి కారణం మింతూర్‌ గ్రామానికి చెందిన రైతు...