Posts

Showing posts with the label the gap between two sessions should not exceed six months

ఆగస్ట్‌లో తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ?

Image
తె లంగాణ రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలను ఆగస్టులో నిర్వహించే అవకాశం ఉన్నది. మార్చిలో బడ్జెట్‌ సమావేశాలు ముగిసిన తర్వాత ఇప్పటి వరకు సమావేశాలు జరుగలేదు. సాధారణంగా సమావేశానికి, సమావేశానికి మధ్య ఆరు నెలలు మించవద్దు. ఈ లెక్కన సెప్టెంబర్‌లోపు శాసనసభ సమావేశాలు జరుగాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆగస్టులో కనీసం వారం రోజులపాటు శాసనసభ సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నది. అన్నీ అనుకూలిస్తే ఆగస్టు 17 నుంచి సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తున్నది. లేక పోతే ఆగస్టు 24 నుంచి జరగవచ్చని అంటున్నారు.ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా ఆదివారం కొన్ని జాతీయ డియా చానళ్లతో మాట్లాడుతూ.. ఆగస్టులో శాసనసభ సమావేశాలు పెడ్తామని, ఈ సమావేశాల్లో.. ఎంపీ, ఎమ్మెల్యేలుగా పోటీచేసే వారి కనీస వయోపరిమితిని 25 ఏండ్ల నుంచి 21 సంవత్సరాలకు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఒక తీర్మానం పంపిస్తామని తెలిపారు. ఈ సమావేశాల్లో మరికొన్ని తీర్మానాలు, బిల్లులు పెట్టే అవకాశం ఉన్నది. శాసనసభ, శాసనమండలిలో ఆధునీకరించిన భవన సముదాయాలను సీఎం రేవంత్‌రెడ్డి ఆగస్టులో ప్రారంభించనున్నారు. ఇటీవల శాసనసభకు వచ...