Posts

Showing posts with the label technological changes being implemented in the agricultural sector

వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన బిల్ గేట్స్

Image
ఆం ధ్రప్రదేశ్ లో వ్యవసాయ రంగంలో అమలవుతున్న సాంకేతిక మార్పులను ప్రత్యక్షంగా చేసేందుకు గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్ గేట్స్ ఉండవల్లి కరకట్ట సమీపంలోని వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకు స్వాగతం పలికి, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఏఐ ఆధారిత రైతు సేవలను వివరించారు. వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు రైతుల్లో సాంకేతిక వినియోగాన్ని పెంచేందుకు చేపట్టిన కార్యక్రమాలను గేట్స్‌కు వివరించారు. దిగుబడులు పెంచడం, సాగు ఖర్చులు తగ్గించడం, నాణ్యమైన ఉత్పత్తులను ఎగుమతి మార్కెట్లకు చేర్చడం వంటి అంశాలపై ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నట్టు తెలిపారు. రైతు సేవా కేంద్రాల్లో అనలిటిక్స్, మానిటరింగ్ డాష్‌బోర్డులు వినియోగిస్తూ పారదర్శక వ్యవస్థను అమలు చేస్తున్నామని చెప్పారు. ఇటీవల ప్రారంభించిన ఏపీఏఐఎంఎస్ రైతు యాప్‌ ద్వారా పంటల ఎంపిక నుంచి మార్కెట్ ధరల వరకు సమగ్ర సమాచారం అందిస్తున్నామని మహిళా రైతులు మణి, అన్నపూర్ణ గేట్స్‌కు వివరించారు. నేల స్వభావం, సాగునీటి నిర్వహణ, పురుగు మందుల నియంత్రణ, మార్కెట్ ధోరణులు ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. బిల్ గేట్స్ సమక్షంలోనే రైతులు ఏ...