కొత్త అవతార్‌లో "కియా సెల్టోస్" : 11 నుంచి బుకింగ్స్ ప్రారంభం
కియా ఏస్ మోడల్ సెల్టోస్‌ను మరింత స్టైలిష్‌గా తీర్చిదిద్దింది. సరికొత్త ఫీచర్లు, డిజైన్‌తో ఆకట్టుకునేలా ఉంది. ఇంటీరియర్, ఫీచర్లు, పవర్ ట్రెయిన్‌లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. డిసెంబర్ 11 నుంచి రూ. 25,000కు బుకింగ్స్ ప్రారంభమవుతాయి. జనవరి 2న ధరల్ని ప్రకటించనున్నారు. కొత్త సెల్టోస్ తన విభాగంలోని టాటా సియెర్రా, హ్యుందాయ్ క్రెటా, మారుతి సుజుకి విక్టోరిస్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్, హోండా ఎలివేట్ కార్లకు భారీ కాంపిటీషన్ ఇవ్వబోతోంది. కొత్త సెల్టోస్ ఎస్‌యూవీ టైగర్ నోస్ గ్రిల్‌ను కలిగి ఉంది. కొత్త 18-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఇందులో ఉన్నాయి. టెయిల్ గేట్ డిజైన్ మరింత స్టైలిష్‌గా మారింది. కనెక్టెడ్ టెయిల్ లైట్లు ఇందులో ఉంటాయి. ముందూ వెనక కొత్త బంపర్‌లను ఇచ్చారు. గన్‌మెటల్ ఫినిష్ స్కిడ్ ప్లేట్లతో బంపర్‌లు ఉన్నాయి. ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, ఫ్లాటర్ రూఫ్‌లైన్, పనోరమిక్ సన్‌రూఫ్, ఇంటిగ్రేటెడ్ రియర్ స్పాయిలర్, షార్క్ ఫిన్ యాంటెన్నాను కలిగి ఉంది. కియా తన K3 ప్లాట్‌ఫారమ్ ఆధారంగా కొత్త సెల్టోస్‌ను తయారుచేసింది. కొలతల్లో కొద్దిగా మార్పులు చోటు చేసుకున్నాయి. గతంతో పోలిస్...