Posts

Showing posts with the label submit their fee records from the last four years to the government within ten days

పెంచిన ఫీజులు వెనక్కి ఇవ్వాలని ప్రైవేట్ స్కూళ్లకు పంజాబ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ

Image
పం జాబ్ లో గత మూడేళ్లుగా వార్షిక ఫీజుల పెంపు పేరిట నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వసూలు చేసిన అదనపు మొత్తాన్ని ప్రైవేట్ పాఠశాలలు వెంటనే తిరిగి చెల్లించాలని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సంచలన ఆదేశాలు జారీ చేశారు. ఈ విప్లవాత్మక నిర్ణయం అమలు కోసం రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ పాఠశాలలు గత నాలుగేళ్ల ఫీజు రికార్డులను పది రోజుల్లోగా ప్రభుత్వానికి సమర్పించాలని సీఎం స్పష్టం చేశారు. ఈ రికార్డుల సమాచారాన్ని పారదర్శకత కోసం విద్యాశాఖ అధికారిక పోర్టల్‌లో ఉంచి ప్రజలందరికీ అందుబాటులో ఉంచనున్నట్లు ప్రకటించారు. ఇటీవల అమృత్‌సర్‌లో స్కూల్ ఫీజు చెల్లించలేదనే కారణంతో పాఠశాల యాజమాన్యం చేసిన మానసిక వేధింపుల తట్టుకోలేక 17 ఏళ్ల విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన అత్యంత పీడాకరమైన ఘటనను ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. "ఈ హృదయ విదారక ఘటన తర్వాత, ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల పెంపుపై తల్లిదండ్రుల నుంచి వెల్లువెత్తిన వేలాది ఫిర్యాదులను పరిశీలించాం. అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకుంటున్నాం. ఒకవేళ ప్రైవేట్ యాజమాన్యాలు ఈ ఆర్డినెన్స్‌ను కోర్టులో సవాలు చేసినా.. మేము చట్టపరంగా పోరాడతాం కానీ, ఈ వ...