2027-28 విద్యా సంవత్సరానికి నవోదయ ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ
2027-28 విద్యా సంవత్సరానికి గాను జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో క్లాసులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి కలిగిన విద్యార్థులు జూలై 31 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఐదో తరగతి పూర్తయినవారు, ఈ ఏడాది ఐదో తరగతి చదువుతున్నవారు అర్హులుగా ఉంటారు. ఈ ఏడాది నవంబర్ 28న ఎంట్రాన్స్ టెస్ట్ ఉంటుంది. మార్చి లేదా ఏప్రిల్ లో ఫలితాలను విడుదల చేస్తారు. అలా మెరిట్ ఆధారంగా మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న 665 విద్యాలయాల్లో ప్రవేశాలు కల్పిస్తారు. జవహర్ నవోదయ విద్యాలయాల్లో సీటు సాధించిన విద్యార్థులు ఆరో తరగతి నుంచి నుంచి 12 వ తరగతి వరకూ నిశ్చింతగా చదువుకునే సువర్ణావకాశం ఉంది. ఇక్కడ చదువుతోపాటు గేమ్స్, సమగ్ర వికాసానికి కూడా ప్రాధాన్యత ఇస్తారు. దేశవ్యాప్తంగా 665 నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో 15, తెలంగాణ లో 9 జవహర్ నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. ఒక్కో నవోదయ విద్యాలయంలో గరిష్ఠంగా 80 మంది విద్యార్థులకు ఆరో తరగతిలో ప్రవేశం లభిస్తుంది. అభ్యర్థులు ప్రవేశం కోరే జిల్లాలోనే ప్రస్తుత విద్యా సంవత్సరంలో చదువుతున్నవారై ఉండాలి. వీటిల్లో ప్రవేశాలకు మొత్తం రెండు విడతల్లో ఎంపిక పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక...