రైలులో రూ. 87 లక్షలు చోరీ : 15 రోజుల్లోనే కేసును ఛేదించిన రైల్వే పోలీసులు
రై లులో ఓ ప్రయాణికుడు నిద్రిస్తుండగా రూ.87 లక్షల నగదు ఉన్న అతని బ్యాగును చోరీ చేసిన నిందితులను రైల్వే పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ రైల్వే ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో జీఆర్‌పీ డీఎస్పీ రత్నరాజు ఈ కేసులో ఇద్దరు నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టి వివరాలు వెల్లడిస్తూ గుంటూరులోని ఒక పౌల్ట్రీ ఫారంలో మేనేజర్‌గా పనిచేస్తున్న బెజవాడ నాగరాజు యజమానుల సూచనల మేరకు గత నెల 31న విజయనగరం, విశాఖపట్నంలోని తమ బ్రాంచ్ కార్యాలయాలకు వెళ్లి అక్కడ నుంచి రూ.87లక్షల నగదుతో గుంటూరుకు బయలుదేరారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో రాయగడ ఎక్స్‌ప్రెస్ బీ1 కోచ్‌లో ఎక్కిన ఆయన తన బ్యాగును బెర్త్ కింద పెట్టి నిద్రపోయాడు. ఒకటో తేదీ తెల్లవారుజామున 3.10 గంటలకు రైలు విజయవాడ చేరుకున్న సమయంలో నాగరాజు తన బ్యాగును చూసుకుంటే కనిపించలేదు. రైలు అంతా వెతికినా ఉపయోగం లేకపోవడంతో అదే రోజు విజయవాడ జీఆర్‌పీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పెద్ద మొత్తంలో నగదు చోరీకి గురవడంతో పోలీసులు ఈ కేసును సవాలుగా తీసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ, సీఐబీ అ...