Posts

Showing posts with the label southwest Bay of Bengal and the Sri Lankan coast

ఆంధ్రప్రదేశ్ కు మరో తుఫాన్ గండం

Image
నై రుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరంలో తుపాన్ ఏర్పడింది. దీనికి దిత్వాగా నామకరణం చేసారు. గడిచిన 6 గంటల్లో 15 కి.మీ వేగంతో కదిలిన తుపాన్ ప్రస్తుతం ట్రింకోమలీకి 200 కి.మీ, పుదుచ్చేరికి 610 కి.మీ, చెన్నైకి ఆగ్నేయంగా 700 కి.మీ దూరంలో కేంద్రీకృతం అయి ఉంది. దీని ప్రభావంతో ఈదురు గాలులు, భారీ వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ శాఖ వెల్లడించింది. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు చేసింది. రానున్న 48 గంటల్లో వాయుగుండం నైరుతి బంగాళా ఖాతం తమిళనాడు ప్రాంతాల్లో తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. దక్షిణ కోస్తా, రాయల సీమ ప్రాంతాల్లో 24 గంటల్లో ఈదురుగాలులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో శనివారం నుంచి సోమవారం వరకూ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. శనివారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, ప్రకాశం, అన్నమయ్య, వైఎస్సార్‌ కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురవొచ్చని తెలిపింది. ఆదివారం నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్సార్‌ కడప జిల్లాల్లో భారీ న...