Posts

Showing posts with the label set up in India will be its second in Asia

బెంగళూరులో ఆంథ్రోపిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆఫీస్

Image
అ మెరికాకు చెందిన ప్రముఖ ఆంథ్రోపిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఇండియాలో తొలి కార్యాలయాన్ని బెంగళూరులో ప్రారంభిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ఈ ఏఐ రాకతో భారత్‌లో బాధ్యతాయుతమైన ఏఐ వినియోగానికి పెద్ద అడుగు మారుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ సంస్థకు టోక్యోలో ఓ కార్యాలయం ఉంది. అయితే భారత్‌లో ఏర్పాటు చేయబోయే కార్యాలయం ఆసియాలో రెండోది. అలాగే కంపెనీలు, భాషాశాస్త్రం, లాభాపేక్షలేని సంస్థలు, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంతటా తమ శ్రేణిని ప్రకటించింది. ఈ అంశంపై ఆంథ్రోపిక్ ఏఐ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఇరినా ఘోష్ మాట్లాడుతూ ఈ ఏఐ ప్రయోజనాలు పెద్ద కంపెనీలకే కాకుండా సాధారణ ప్రజలకు సైతం అందేలా చేయాలన్న లక్ష్యంతో ఈ విస్తరణ జరుగుతోందని తెలిపారు. ఈ కార్యాలయంతో పాటు అనేక భారతీయ సంస్థలతో భాగస్వామ్యాలు సైతం ప్రకటించారు. ఎయిర్ ఇండియాతో కలిసి కస్టమ్ సాఫ్ట్‌వేర్ అభివృద్ధి చేయడానికి డెవలపర్లకు సహాయం చేయనున్నట్లు వెల్లడించారు. ఫిన్‌టెక్ సంస్థ క్రెడ్ క్లాడ్ కోడ్ ను ఉపయోగించి ఫీచర్లను రెట్టింపు వేగంతో అందిస్తోందని తెలిపారు. ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ పాత సిస్టమ్‌లను ఆధునీకరించడానికి, కొత్త సాఫ్ట్‌...