Posts

Showing posts with the label seized weapons and ammunition from them

మణిపూర్‌లో ఇద్దరు అరెస్టు : ఆయుధాలు స్వాధీనం

Image
మ ణిపూర్‌లోని ఇంఫాల్‌ తూర్పు జిల్లాలో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్‌ చేసి, వారి నుండి ఆయుధాలు, మందు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నాట్లు పోలీసులు తెలిపారు. రెబంట క్షేత్రిమయుమ్‌ అనే వ్యక్తిని మపాన్‌ ప్రాంతంలోని అతని నివాసం నుండి శనివారం అదుపులోకి తీసుకున్నామని అన్నారు. అతని నుండి 9 ఎంఎం పిస్టల్‌తో పాటు 18 కాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తంగ్జామ్‌ ఖునౌ ప్రాంతం నుండి అరిబామ్‌ గునీంద్రో శర్మను అదుపులోకి తీసుకున్నామని అన్నారు. వివిధ కాలిబర్‌ల 13 కాట్రిడ్జ్‌లు మరియు మూడు ఖాళీ 12-బోర్‌ కాట్రిడ్జ్‌ షెల్‌లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.