Posts

Showing posts with the label resided in Lakshmiguda

వాటర్‌ ట్యాంకర్‌ ఢీకొని ఒకరు మృతి

Image
హై దరాబాద్‌లోని నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఓ కార్పెంటర్‌ను వాటర్‌ ట్యాంకర్‌ వెనకనుంచి ఢీకొనడంతో అక్కడికకకడే మృతి చెందాడు. ఎస్‌ఐ మునీందర్‌ తెలిపిన మేరకు.. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన సుశీల్‌కుమార్‌(28), సురేష్‌లు కాటేదాన్‌లోని లక్ష్మీగూడలో నివాసముంటున్నారు. హఫీజ్‌పేట్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో పని ముగించుకుని రాత్రి తమ ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళుతుండగా పుప్పాలగూడ టోల్‌గేట్‌ వద్ద అతివేగంగా వచ్చిన నీటి ట్యాంకర్‌ వీరిని ఢీకొట్టింది. వెనుక కూర్చున్న సుశీల్‌కుమార్‌ అక్కడికక్కడే మృతి చెందగా సురేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతనిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లారు. మరో కారు, మరొక స్కూటీలను కూడా ట్యాంకర్‌ఢీకొట్టింది. అయితే వారికి ఎవరికీ గాయాలు కాలేదు. ఖానాపూర్‌ గ్రామానికి చెందిన డ్రైవర్‌ రంజిత్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.