ఆగస్టు 7న నేతన్న భరోసా పథకం అమలు
చే నేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 7వ తేదీన నేతన్న భరోసా పథకాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే దీనికి సంబంధించిన కసరత్తును చేనేత జౌళి శాఖ పూర్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 54 వేల మంది అర్హులకు నేతన్న భరోసా పథకాన్ని అందించనున్నట్టుగా తెలుస్తోంది. ఈ పథకం కింద చేనేత కార్మికులకు సంవత్సరానికి 25 వేల రూపాయలు చొప్పున అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత వైసిపి సర్కార్ హయాంలో ఈ పథకం కింద 24వేల రూపాయలు ఇవ్వగా, గత ప్రభుత్వం కంటే వెయ్యి రూపాయలు అదనంగా కలిపి, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను మాట ఇవ్వనప్పటికీ కూడా ఏపీ సర్కార్ చేనేతలకు అండగా నిలుస్తోంది.చేనేత కార్మికులను ఉద్దేశించి గతంలో మాట్లాడిన చంద్రబాబు వారికి అండగా నిలుస్తామని గత ప్రభుత్వం కంటే అదనంగా వెయ్యి రూపాయలు కలిపి సంవత్సరానికి 25వేలు చొప్పున ఆర్థికసహాయం అందిస్తామని పేర్కొన్నారు. ఈ పథకం అమలుకు ఇప్పటికే కూటమి ప్రభుత్వం బడ్జెట్లో 250 కోట్లు కేటాయించింది. త్వరలో దీనికి సంబంధించిన విధి విధానాలను కూడా విడుదల చేయనుంది. సొంత మగ్గం ఉండే చేనేత కార్మికులకు కుటుంబానికి ఒకరికి చొప్పున ఈ పథకాన్ని అం...