Posts

Showing posts with the label progress of Medaram development works through a PowerPoint presentation

మేడారం అభివృద్ధి పనుల పురోగతిని పవర్ పాయింట్ ప్రజంటేషన్‌ ద్వారా పరిశీలించిన ముఖ్యమంత్రి

Image
తె లంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పనుల పురోగతిని పవర్ పాయింట్ ప్రజంటేషన్‌ ద్వారా పరిశీలించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించలని, అధికారులు, ఇంజినీర్లు క్షేత్రస్థాయిలో ఉండి పర్యవేక్షించాలని ఆదేశించారు. ఆర్ అండ్ బీ, విద్యుత్ శాఖ, దేవాదాయ శాఖ, అటవీ శాఖ, స్థపతి శివనాగిరెడ్డి సమన్వయంతో పనులు చేయాలని సూచించారు. అభివృద్ధి పనుల్లో ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలకు పెద్ద పీట వేయాలన్నారు. నిర్దేశిత సమయంలో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఏ ఈ సందర్భంగా హెచ్చరించారు