Posts

Showing posts with the label poured ghee and wine on his body.. atrocity in Delhi

హార్డ్ డిస్క్‌లో వున్న నా ప్రైవేటు వీడియోలను డిలీట్ చేయనందుకు చంపాను : అమృతా చౌహాన్‌

Image
ఢి ల్లీలో సంచలనం సృష్టించిన రామ్ కేశ్ మీనా హత్య కేసు చిక్కుముడి వీడింది. ఈ కేసులో షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వచ్చాయి. తిమార్‌పూర్‌ ప్రాంతంలో జరిగిన అగ్నిప్రమాదంలో చనిపోయిన రామ్‌ది సాధారణ మరణం కాదని, అది పక్కా ప్రణాళికతో చేసిన హత్య అని పోలీసులు తేల్చారు. మృతుడితో సహజీవనం చేసిన యువతే మరో ఇద్దరితో కలిసి ఈ దారుణానికి పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈనెల 6న తిమార్‌పుర్‌లోని ఓ భవనంలో పేలుడు సంభవించినట్లు సమాచారం అందింది. ఘటనా స్థలంలో కాలిపోయిన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతుడిని 32 ఏళ్ల రామ్‌కేశ్‌ మీనాగా గుర్తించారు. ఆయన సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించి సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా కీలక విషయాలు బయటపడ్డాయి. పేలుడుకు ముందు రోజు రాత్రి ముసుగులు ధరించిన ఇద్దరు వ్యక్తులు భవనంలోకి వెళ్లినట్లు కనిపించింది. కాసేపటి తర్వాత వారితో పాటు ఓ యువతి కూడా బయటకొచ్చింది. వీరు వెళ్లిపోయిన కాసేపటికే భవనంలో పేలుడు జరిగింది. సీసీటీవీలో కనిపించిన ఆ యువతిని ఫోరెన్సిక్ సైన్సెస్ విద్యార్థిని అమృతా చౌహాన్‌గా గుర్తించారు. రామ్‌కేశ్‌తో ఆమె సహజీవనం చేస్తోంది. పోలీస...