Posts

Showing posts with the label posted on 'X' platform today

శివసేన, ఎంఎన్‌ఎస్ మధ్య పొత్తుపై కాంగ్రెస్ పార్టీకి అభ్యంతరం ఉన్నప్పటికీ, అది ఏమాత్రం పట్టించుకోదగిన విషయం కాదు : ఎంపీ సంజయ్ రౌత్

Image
మ హారాష్ట్రలో శివసేన, మహారాష్ట్ర నవ నిర్మాణ సేన కూటమిలో చేరాలనుకుంటే కాంగ్రెస్ పార్టీకి అభ్యంతరం ఉన్నప్పటికీ, అది ఏమాత్రం పట్టించుకోదగిన విషయం కాదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఈరోజు ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ పెట్టారు. అయితే, కాంగ్రెస్ పార్టీ ఈ పొత్తు కోసం ఢిల్లీలోని తమ అధిష్టానంతో చర్చించకుండా ఎలాంటి హామీ ఇవ్వడానికి ఆలోచిస్తుంది. ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది వారి వ్యక్తిగత విషయమేనన్నారు. కానీ శివసేన- ఎంఎన్‌ఎస్ ఎవరి అనుమతి కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కాగా, ప్రజల కోరిక మేరకే మా రెండు పార్టీలు ఒక్కటయ్యాయి.. దీనికి ఎవరి అనుమతి అవసరం లేదన్నారు. తమతో కలిసి వచ్చేందుకు శరద్ పవార్ - వామపక్షాలు కూడా సిద్ధంగా ఉన్నాయని సంజయ్ రౌత్ వెల్లడించారు. ఇక, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ సైతం బీజేపీని ఎదుర్కోవడానికి అందరూ ఏకమవ్వడం మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిందని శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ పేర్కొన్నారు. ఎన్‌సీపీ, శివసేన (యూబీటీ)తో పొత్తును ఖరారు చేసుకునే దిశగా అడుగులు పడుతున్నాయి.. ఇది పరోక్షంగా ఎంఎన్‌ఎస్‌ను కూడా కూటమిలో చేర్చుకోవడానికి ఒప్పుకున్నట్లేనని తెలిపారు. ఎంవీఏ (మహా వికాస్ అఘ...