Posts

Showing posts with the label post shared on Instagram

ఆస్ట్రేలియాలో నా ఒక్కరోజు సంపాదన భారత్‌లో నెల జీతంతో సమానం : ప్రవాస భారతీయుడి పోస్ట్ వైరల్

Image
ఆ స్ట్రేలియాలో ఉంటున్న రవీందర్ అనే భారతీయుడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ నెట్టింట పెద్ద చర్చకు దారితీసింది. అక్కడ తన ఒక్క రోజు సంపాదన, భారత్‌లో తాను గతంలో పొందిన నెల జీతంతో సమానమని ఆయన పేర్కొన్నారు. రవీందర్ తన పోస్ట్‌లో ఆస్ట్రేలియాలోని పని గంటలు మరియు సంపాదన గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాను ఉదయం 7 గంటలకు పని మొదలుపెట్టి, అర్ధరాత్రి వరకు కష్టపడతానని ఆయన చెప్పారు. అంత సేపు పనిచేసినా తన శరీరం అలసిపోదని వెల్లడించడం గమనార్హం. రోజుకు సుమారు 650 నుండి 700 ఆస్ట్రేలియా డాలర్లు సంపాదిస్తున్నట్లు తెలిపారు. అంటే భారత కరెన్సీలో ఇది దాదాపు రూ. 46,000. కేవలం ఒక్క రోజు జీతంతో తన ఇంటికి నెల రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు కొనగలనని ఆయన వివరించారు. యువత భారత్ నుంచి బయటకు వచ్చి ప్రపంచాన్ని అన్వేషించాలని, కష్టపడి పనిచేసి ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. రవీందర్ పోస్ట్‌పై సోషల్ మీడియాలో భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. విదేశాల్లో కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుందని కొందరు ఆయన్ను సమర్థిస్తున్నారు. "బయట దేశాల్లో ఆదాయం ఎంత ఎక్కువగా ఉంటుందో, ఖర్చులు, పన్నులుకూడా అంతే ఎక్కువగా ఉ...