Posts

Showing posts with the label order would be issued in a day or two

ప్రభుత్వ ఉద్యోగులకు మరో డీఏ ఇస్తున్నట్లు సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటన

Image
తె లంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు మరో డీఏ ఇస్తున్నట్లు సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ సచివాలయంలో మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్‌ డీఏ ఫైల్‌ మీద సంతకం చేసి వచ్చానని, రేపో మాపో డీఏ జీవో వస్తుందని తెలిపారు. ఈ నిర్ణయం రాష్ట్రంలోని వేలాది మంది పెన్షనర్లకు ఉపశమనం కలగనుంది. ప్రస్తుతం అమలులో ఉన్న 30.03శాతం డీఆర్‌ను 33.67శాతానికి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంపు 2018 జూలై 1 తర్వాత రిటైర్డ్ అయిన పెన్షనర్లకు వర్తించనుంది. 2020 రివైజ్డ్ పే స్కేల్స్ ప్రకారం పెన్షన్ పొందుతున్న వారికి ప్రత్యక్ష లాభం కలిగిస్తుంది. 2018కి ముందు రిటైర్డ్ అయిన పెన్షనర్లకు కూడా డీఆర్ పెంపు వర్తించనుంది. 2015 పే స్కేల్స్ ప్రకారం పెన్షన్ పొందుతున్న వారికి డీఆర్ 68.628శాతం నుంచి 73.344శాతానికి పెరిగింది. 2016 పే స్కేల్స్ పెన్షనర్లకు డీఆర్ 42శాతం నుంచి 46శాతానికి పెంపు జరిగింది. UGC/AICTE 2006 పే స్కేల్స్ ప్రకారం పెన్షన్ పొందుతున్న వారికి డీఆర్ 221శాతం నుంచి 230శాతానికి పెరిగింది. డీఆర్ 2023 జూలై 1 నుంచి అమలులోకి వస్తుంది. 2023 జూలై నుంచి 2025 డిసెంబర్ వరకు పెరిగిన డీఆర్ బకాయిలు చెల్లించనున్నారు. ఈ బకాయి...