విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు ప్రారంభం
ఆం ధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలోని కాజా నుంచి కృష్ణా జిల్లాలోని పెదఅవుటుపల్లి వరకు నిర్మించిన బైపాస్ రోడ్డును అధికారులు అందుబాటులోకి తెచ్చారు. ఈ రహదారిలో ఒక వైపును మాత్రమే ప్రస్తుతం వాహనాలకు అనుమతించారు. నేడు సంక్రాంతి పర్వదినాన ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు శాస్త్రోక్తంగా పూజలు చేసి బైపాస్‌ను ప్రారంభించారు. తొలుత వారి వాహనాలు, ఆపై సాధారణ వాహనాలకు అనుమతి ఇవ్వగా వాహనాలు ఒకవైపు నడుస్తున్నాయి. మార్చిలోపు రెండోవైపు రహదారిని కూడా పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తామని అధికారులు చెప్తున్నారు. ఈ బైపాస్‌తో చెన్నై, గుంటూరు మార్గంలో రహదారిపై రద్దీ కాస్త తగ్గుతుంది. విజయవాడ ట్రాఫిక్ లో చిక్కుకోకుండా ప్రయాణాలు సాగించే అవకాశం ఉంటుంది. దీనివలన చెన్నై, గుంటూరుల నుండి వచ్చే వాహనాలకు ప్రయోజనం చేకూరనుంది. కాజా టోల్‌గేట్ దాటి బైపాస్‌లోకి వచ్చి గొల్లపూడి మీదుగా చిన్నఅవుటపల్లి వరకు వెళ్లి ఏలూరు హైవేలోకి కలవవచ్చు. గుంటూరు నుండి హైదరాబాద్ వెళ్లే వాహనాలు గొల్లపూడి వద్ద విజయవాడ-హైదరాబాద్ హైవేలోకి ప్రవేశించవచ్చు. దీనివల్ల విజయవాడ నగరంలోకి రాకుండానే ఏలూరు, హైదరాబాద్‌లను చేరుకునే అవకాశం లభించింది. అయితే, గొల్లపూడి వై...