Posts

Showing posts with the label new officers have been appointed to key departments in the police department

తెలంగాణలో 32 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

Image
తె లంగాణలో 32 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీలలో భాగంగా పోలీసు శాఖలోని ప్రధాన విభాగాలకు కొత్త సారాధులను నియమించింది. ఈ మార్పుల్లో భాగంగా జయేంద్రసింగ్ చౌహాన్‌ను అదనపు డీజీగా నియమించగా, పరిమళ హన నూతన్ జాకబ్‌కు సీఐడీ డీజీ బాధ్యతలు అప్పగించారు. పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా చేతన్ మైలబత్తుల నియామకం జరిగింది. మహేశ్వరం జోన్ డీసీపీగా కే నారాయణ రెడ్డి, టీఎస్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఎస్పీగా పీవీ పద్మజను పోస్టింగ్ చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో ఎస్పీగా సంగ్రామ్ సింగ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీగా కిరణ్ ప్రభాకర్‌ను నియమించగా, మహబూబాబాద్ ఎస్పీగా శబరీష్‌ను మార్చారు. కొమరంభీం ఆసిఫాబాద్ ఎస్పీగా నిఖితను ఎంపిక చేశారు. అలాగే యాంటీ నార్కోటిక్స్ బ్యూరోలో మరో ఎస్పీగా గిరిధర్‌ను నియమించారు. వికారాబాద్ ఎస్పీ పదవి స్నేహా మిశ్రాకు దక్కింది. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా గైక్వాడ్ వైభవ్‌ను నియమించారు. ములుగు జిల్లా ఎస్పీగా కేకేఎన్ సుధీర్ రామ్‌నాథ్, జయశంకర్ భూపాలపల్లి ఎస్పీగా సంకీర్త్ కొత్త బాధ్యతలు తీసుకోనున్నారు. గవర్నర్ ఏడీసీగా...