Posts

Showing posts with the label near Peketipakalu

అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన కారు : దంపతుల దుర్మరణం

Image
ఆం ధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా మండపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తాపేశ్వరం శివారు పేకేటిపాకలు వద్ద ఒక కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు మృతి చెందారు. ప్రమాద సమయంలో భర్త బోగిల్లి వీరవెంకట సతీష్ (40) కారు డ్రైవ్ చేస్తుండగా, భార్య బోగిల్లి కిరణ్మయి (36) ఆయన పక్కనే ఉన్నారు.  కాకినాడలో బంధువుల పెళ్లికి వెళ్లి తిరిగి సొంతూరైన వెలగతోడు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు చెరువులో మునిగిన కారును క్రేన్ సహాయంతో బయటకు తీశారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించి, బంధువులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.