Posts

Showing posts with the label named Sudarshan

S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను ఆవిష్కరించిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్

Image
ఇం డియన్ ఎయిర్ ఫోర్స్ అధునాతన S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను ఆవిష్కరించింది. S-400 రక్షణ వ్యవస్థకు సుదర్శన్ గా నామకరణం చేసింది. ఇది దేశ వైమానిక రక్షణ సామర్థ్యాలలో కీలకమైన ముందడుగుగా భావించవచ్చు. ఆకాశం గుండా భారత్ కు పొంచి ఉన్న ముప్పును ఈ రక్షణ వ్యవస్థ సమర్థవంతంగా తిప్పి కొట్టనుంది. ఈ రక్షణ వ్యవస్థల్ని రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసింది. ఈ మేరకు 2018 లో ఐదు S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కొనుగోలుకు భారత్- రష్యా మధ్య ఒప్పందం కుదిరింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో భారత ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పాకిస్థాన్ కు చెందిన డ్రోన్ లు, క్షిపణులపై విరుచుకుపడి వాటిని ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తన అధునాతన S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను ఆవిష్కరించింది. ఈ S-400 వ్యవస్థ ఎలాంటి టార్గెట్ అయినా ఛేదించగలదు. ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్, అన్ మ్యానెడ్ ఏరియల్ వెహికల్స్, క్రూయిజ్ మిసైల్స్, బాలిస్టిక్ మిసైల్స్, లాంగ్ రేంజ్ మిసైల్స్ ను సమర్థవంతంగా నేలకూల్చే శక్తి ఈ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ సొంతం. ఈ అడ్వాన్స్ డ్ S-400 సుదర్శన్ ఇండియన్ ఎయిర్ డ...