Posts

Showing posts with the label name of accreditations and media cards

తెలంగాణాలో వర్కింగ్ జర్నలిస్టులను విభజించొద్దు !

Image
తె లంగాణాలో వర్కింగ్ జర్నలిస్టులను అక్రెడిటేషన్లు, మీడియా కార్డుల పేరుతో విభజించొద్దని డెస్క్ జర్నలిస్ట్స్​ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ(డీజేఎఫ్​టీ) రాష్ట్ర అధ్యక్షులు బాదిని ఉపేందర్, ప్రధాన కార్యదర్శి ఎస్‌కే మస్తాన్ కోరారు. డెస్క్ జర్నలిస్టులకు పాత పద్ధతిలోనే అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శనివారం లక్డీకాపూల్​లోని హైదరాబాద్ కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి వివిధ పత్రికలకు చెందిన డెస్క్ జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో హాజయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డెస్క్ జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు తీసేసి, మీడియా కార్డులు ఇవ్వడం సరికాదన్నారు. ఇది జర్నలిస్టుల పట్ల వివక్ష చూపినట్లు అవుతుందని స్పష్టం చేశారు. రిపోర్టర్లు, డెస్క్ జర్నలిస్టులు కలిస్తేనే జర్నలిజం అవుతుందని చెప్పారు. మీడియా కార్డుల పేరుతో డెస్క్ జర్నలిస్టులను రెండో గ్రేడ్​ వారిగా మర్చొద్దని చెప్పారు. అలాగే జీవో నంబర్ 252ను సవరించాలని, స్పోర్ట్స్, సినిమా, ఫీచర్స్, వెబ్, కల్చరల్, బిజినెస్, కార్టునిస్టులకు గతంలో లాగా అక్రెడిటేషన్ కార్డులివ్వాలని డిమాండ్​ చేశారు. అనంతరం అడిషనల్ కలెక్టర్‌ కదిరవన్ కు వినతి పత్రం ...