Posts

Showing posts with the label media representatives

ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ ఐసీసీ అవార్డును దక్కించుకున్న లారా వోల్వార్డ్ట్‌

Image
2025 అక్టోబర్‌ నెలకు గానూ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ ఐసీసీ అవార్డును దక్షిణాఫ్రికా మహిళా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ లారా వోల్వార్డ్ట్‌  కైవసం చేసుకుంది. అక్టోబర్‌ నెలలో అత్యుత్తమ ప్రదర్శనలకు గానూ లారాకు ఈ అవార్డు దక్కింది. తాజాగా ముగిసిన వన్డే ప్రపంచకప్‌-2025లో లీడింగ్‌ రన్‌ స్కోరర్‌గా నిలిచిన ఆమె అక్టోబర్‌లో 8 మ్యాచ్‌లు ఆడి 470 పరుగులు చేసింది. గత నెలలో ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో భారీ సెంచరీ (169) చేసి తన జట్టును ఫైనల్‌కు చేర్చింది. ఈ నెలలో భారత్‌తో జరిగిన ఫైనల్లోనూ సెంచరీ చేసింది. లారా సెంచరీతో మెరిసినా సౌతాఫ్రికా ఫైనల్లో భారత్‌ చేతిలో ఓటమిపాలై, రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డు గెలుచుకున్న తర్వాత లారా మాట్లాడుతూ.. ఈ అవార్డు రావడం చాలా గర్వంగా ఉంది. ప్రపంచకప్‌ టైటిల్ గెలవలేకపోయినా, మా పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని అంది. ఈ అవార్డు కోసం భారత స్టార్‌ బ్యాటర్‌, ప్రపంచకప్‌ సెకెండ్‌ లీడింగ్‌ రన్‌ స్కోరర్‌ స్మృతి మంధన, ఆసీస్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ ఆష్లే గార్డ్‌నర్‌ పోటీపడినప్పటికీ.. లారానే అదృష్టం వరించింది. అక్టోబర్‌ నెల ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డు పురుషుల విభాగం...