వాయుసేనలో పాక్ గూఢచారి అరెస్టు
రా జస్థాన్ ఇంటెలిజెన్స్, ఎయిర్ ఫోర్స్ నిఘా వర్గాలు జరిపిన మెరుపు దాడిలో ఈ భారీ గూఢచారి నెట్‌వర్క్ గుట్టు రట్టయింది. ఈ ఆపరేషన్ ఒక చిన్న అనుమానంతో మొదలైంది. ఈ ఏడాది జనవరిలో జైసల్మేర్‌కు చెందిన ఝబారా రామ్ అనే వ్యక్తిని రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేయగా, విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. పాక్ హ్యాండ్లర్లతో నిరంతరం టచ్‌లో ఉన్న ఒక 'పెద్ద చేప' గురించి రామ్ సమాచారం ఇచ్చాడు. ఆ క్లూ ఆధారంగా దర్యాప్తు చేయగా.. అస్సాంలోని చబువా ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో మల్టీ-టాస్కింగ్ స్టాఫ్‌గా పనిచేస్తున్న 36 ఏళ్ల సుమిత్ కుమార్ అసలు రంగు బయటపడింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన సుమిత్ కుమార్, 2023 నుంచే పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో చేతులు కలిపినట్లు తేలింది. కేవలం కొన్ని వేల రూపాయల ఆశ చూపి పాక్ హ్యాండ్లర్లు ఇతడిని బుట్టలో వేసుకున్నారు. తన ఉద్యోగ హోదాను అడ్డం పెట్టుకుని, వాయుసేనలోని అత్యంత సున్నితమైన సమాచారాన్ని సేకరించి సోషల్ మీడియా ద్వారా సరిహద్దులు దాటించాడు. యుద్ధ విమానాలు, క్షిపణి వ్యవస్థల మోహరింపు వివరాలు. చబువా, బికనీర్ (నల్) వంటి కీలక ఎయిర్ బేస్‌ల మ్యాపులు. కీలక అధికారులు, సిబ్బం...